Saturday, December 31, 2016

ఆలోకం వదిలేసి ఈలోకం వచ్చినావ

ఆలోకం వదిలేసి ఈలోకం వచ్చినావ | ఆలి కోసమంతులేని ఆవేదన చెందినావ
ఆకాశ రాజు అల్లుడా ఓ వేంకటేశ | అలివేలు మంగ నాదుడా ఓ శ్రీనివాస                     || ఆలోకం ||

నల్లని మోముపైన నామాలు కలవాడా | వజ్రాలు రత్నాలు వంటిమీద ఉన్నవాడా
ఇంపైన మోమునీదిరా ఓ వేంకటేశ | నీ కనులే సూర్య చంద్రులూ ఓ శ్రీనివాస             || ఆలోకం ||

తలమీద వజ్రాల కిరీటాన్ని పెట్టుకోని | బంగారు రథముపై ఉరేగుచున్నావా
కుబేరున్నే మించినావురా ఓ వేంకటేశ | నీకు సాటి ఎవరు రారురా ఓ శ్రీనివాస            || ఆలోకం ||

కొండల్లో ఉండికూడా కోట్లు కూడబెట్టినోడా | ఒయ్యారం ఒంపు సొంపు ఒలకబోసే వన్నేవేరా
ఒట్టిపూజ నీవొప్పవురా ఓ వేంకటేశ | వడ్డీలకు వడ్డీ నీదేరా ఓ శ్రీనివాస                          || ఆలోకం || 

No comments:

Post a Comment