Monday, June 6, 2011

జాన పదం..!

"... జన పథానికి నాంది జానపదం!" 

జాన పదం... జనం లోంచి పుట్టిన తీయని రాగాల స్రవంతి. కష్టంలో సుఖంలో జనం తమ భావాలను నలుగురితో పంచుకునే ఓ వెన్నెల. జనం గుండెల్లో పుట్టి, పెదాలపై పెరిగి, విశ్వమంతా వ్యాపించిన ఓ ఆనందానుభూతి జానపదం. 

జాన పదానికి పుట్టినిల్లు పల్లెటూళ్ళు. కొండల్లో.. కోనల్లో.. వాగుల్లో.. వంకల్లో.. సాగరతీరాల్లో.. ఇసక తిన్నెల్లో.. మసక చీకట్లో.. మనసు వెన్నెట్లో.. శ్రమజీవి సేద తీరడానికి పాడుకునే సెలయేటి పాట జాన పదం. 

జాన పదానికి అల్లసాని వారి జిగి బిగి అల్లిక తెలియదు. స్వచ్చమైన మల్లెపూవు లాంటి పల్లెలలోని వాడుక పదాల కలయికే జాన పదం.