Sunday, January 1, 2017

|| భగవాన్ శరణం భగవతి శరణం ||

భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్ప              || భగవాన్ ||

మహిషి సంహార మదగజ వాహన శరణం శరణం అయ్యప్ప
సుగుణ విలాస సుందర రూప శరణం శరణం అయ్యప్ప                 || భగవాన్ ||

కరిమలవాసా పాపవినాశా శరణం శరణం అయ్యప్ప
కరుణతో మమ్ము కాపాడుమయ్యా శరణం శరణం అయ్యప్ప           || భగవాన్ ||

నలుబది దినములు భక్తితో నిన్ను సేవించెదమూ అయ్యప్ప
పగలూ రేయీ నీనామ స్మరణం శరణం శరణం అయ్యప్ప              || భగవాన్ ||

పాలాభిషేకం నీకప్పా నీ పాద పద్మములు మాకప్పా
కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా                          || భగవాన్ ||

Saturday, December 31, 2016

|| పళ్ళిక్కట్టు శబరిమళక్కు ||

పళ్ళిక్కట్టు శబరిమళక్కు | కళ్లుం ముళ్లుం కాలికి మెత్తెయ్        || స్వామియే ||
స్వామియే అయ్యప్పో | అయ్యప్పో స్వామియే                             || స్వామియే ||

అఖిలాండేశ్వరి అయ్యప్పా | ఆపద్భాంధవ అయ్యప్పా             || స్వామియే ||
అభయము నీవే అయ్యప్పా | ఆశ్రీత వత్సల అయ్యప్పా           || స్వామియే ||

నెయ్యాభిషేకం స్వామికే | తేనాభిషేకం స్వామికే                        || స్వామియే ||
పూలాభిషేకం స్వామికే | పాలాభిషేకం స్వామికే                         || స్వామియే ||

దేవన్ పాదం దేవీ పాదం | భగవానే భగవతియే                          || స్వామియే ||
శరణం శరణం అయ్యప్పా | స్వామీ శరణం అయ్యప్పా             || స్వామియే || 

ఆలోకం వదిలేసి ఈలోకం వచ్చినావ

ఆలోకం వదిలేసి ఈలోకం వచ్చినావ | ఆలి కోసమంతులేని ఆవేదన చెందినావ
ఆకాశ రాజు అల్లుడా ఓ వేంకటేశ | అలివేలు మంగ నాదుడా ఓ శ్రీనివాస                     || ఆలోకం ||

నల్లని మోముపైన నామాలు కలవాడా | వజ్రాలు రత్నాలు వంటిమీద ఉన్నవాడా
ఇంపైన మోమునీదిరా ఓ వేంకటేశ | నీ కనులే సూర్య చంద్రులూ ఓ శ్రీనివాస             || ఆలోకం ||

తలమీద వజ్రాల కిరీటాన్ని పెట్టుకోని | బంగారు రథముపై ఉరేగుచున్నావా
కుబేరున్నే మించినావురా ఓ వేంకటేశ | నీకు సాటి ఎవరు రారురా ఓ శ్రీనివాస            || ఆలోకం ||

కొండల్లో ఉండికూడా కోట్లు కూడబెట్టినోడా | ఒయ్యారం ఒంపు సొంపు ఒలకబోసే వన్నేవేరా
ఒట్టిపూజ నీవొప్పవురా ఓ వేంకటేశ | వడ్డీలకు వడ్డీ నీదేరా ఓ శ్రీనివాస                          || ఆలోకం || 

|| దిగు దిగు దిగు నాగ నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్య సుందర నాగ నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్య సుందర నాగ నాగన్న      || దిగు ||

ఇల్లలికి ముగ్గు పెట్టి నాగన్న ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసనతో నాగన్న కోలాటమాడిపోరా నాగన్న             || దిగు ||

బామాలంత చేరి నాగన్నబావి నీళ్ల కెళితే నాగన్న
బావిలో ఉన్నావ నాగన్న బాలా నాగువయ్యా నాగన్న            || దిగు ||

పిల్లాలంత చేరి నాగన్న పుల్లాలేరబోతే నాగన్న
పుల్లల్లో ఉన్నావా నాగన్న పుల్లా నాగువయ్యా నాగన్న  
పుట్టలో ఉన్నావా నాగన్న పుట్టా నాగువయ్యా నాగన్న           || దిగు ||




ఆదిశేష అనంత శయన

ఆదిశేష అనంత శయన - శ్రీనివాస శ్రీ వేంకటేశా                               || ఆది ||
రఘుకుల తిలకా రఘు రామచంద్రా - సీతాపతే శ్రీ రామచంద్రా      || ఆది ||
యదుకుల భూషణ యశోద తనయ - రాధాపతే శ్రీ గోపాలకృష్ణా       || ఆది ||
పన్నగ భూషణ కైలాస వాసా - గౌరీపతే శివ శంభో శంకర                    || ఆది ||
మూషిక వాహన మోదక హస్తా - గౌరీపుత్రా శ్రీ గణేశ దేవా                      || ఆది ||
మయూర వాహన మంగళ రూపా - పళని గిరీశ్వర శ్రీ సుబ్రమణ్యా      || ఆది ||
రామ దూతా రాక్షస మర్దన - అతి బలవంతా శ్రీ ఆంజనేయ              || ఆది ||
వన్పులి వాహన విల్లాలి వీరా - శబరీ గిరీశ్వర శ్రీ ధర్మ శాస్తా                || ఆది ||
ఆనంద నిలయా వీరాధివీరా - మోహిని పుత్రా అయ్యప్ప స్వామీ       || ఆది ||
కలియుగ జ్యోతీ శబరీ గిరీశా - అనాధ రక్షక అయ్యప్ప స్వామీ            || ఆది ||  

గణేశ శరణం శరణం గణేశ

గణేశ శరణం శరణం గణేశ | గణేశ శరణం శరణం గణేశ               || గణేశ ||
మూషిక వాహన శరణం గణేశ | మోదక హస్తా శరణం గణేశ           || గణేశ ||

విఘ్న వినాయక శరణం గణేశ | వరద వినాయక శరణం గణేశ    || గణేశ ||
గజముఖ వదన శరణం గణేశ | గౌరీ పుత్రా శరణం గణేశ               || గణేశ ||

అయ్యప్ప సోదర శరణం గణేశ | ఆర్ముగ సోదర శరణం గణేశ      || గణేశ ||
మునిజన వందిత శరణం గణేశ | ముక్తి ప్రదాతా శరణం గణేశ     || గణేశ ||

శాస్తా సోదర శరణం గణేశ | శక్తి సుపుత్రా శరణం గణేశ                   || గణేశ ||
భక్త వత్సలా శరణం గణేశ | భక్తుల బ్రోవుము శరణం గణేశ           || గణేశ || 

Saturday, November 26, 2016

బొంగరం తిరగడానికి తాడు కావాలి. గాలి పటం ఎగరడానికి దారం కావాలి. జీవితం సాగడానికి నమ్మకం కావాలి... :)